SKLM: ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని శ్రీకాకుళం మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కోటి, డాక్టర్ శిరీషలు కోరారు. 8వ జన ఔషది దివాస్ సందర్భంగా కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 50 మందికి బీపీ, షుగర్,ఈసీజీ ఉచిత పరీక్షలు నిర్వహించారు. అలాగే, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.