KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో ముక్కరమ్మకు చెందిన ప్రభుత్వ స్థల కేటాయింపు, పట్టా హక్కుల వివాదంపై వైసీపీ నేతలు బుధవారం ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు మంగళవారం తెలిపారు. ముక్కరమ్మకు పూర్తిస్థాయి న్యాయం కల్పించాలని, సమర్పించిన అర్జీ పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.