KRNL: నగరంలోని బాలాజీ నగర్ ప్రాంతంలో ఇవాళ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కూలర్ల తయారీ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. మంటల ధాటికి అక్కడ ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. అయితే ఆస్తి నష్టం లక్షల్లో ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.