KMR: అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల సందర్భంగా కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నిద్రకు ఉపయోగపడే చిట్కాలు, కోపం తగ్గించే చిట్కాలను వివరించారు.