Telangana Govt : రీల్ చేస్తే.. రూ.లక్ష బహుమతి: తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్..!
Telangana Govt : ఈరోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని తహతహలాడేవారే. దాని కోసం సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ రీల్స్ చేసి... డబ్బు సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు.
ఈరోజుల్లో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నవారందరూ సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని తహతహలాడేవారే. దాని కోసం సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫేమస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ రీల్స్ చేసి… డబ్బు సంపాదిస్తున్నవారు కూడా ఉన్నారు. అలా రీల్స్ చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా రీల్స్ చేసేవారికి రూ.లక్ష బహుమతి అందిస్తామని చెప్పడం విశేషం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ప్రత్యేకతలపై రీల్స్ చేసి పోస్ట్ చేస్తే 1 లక్ష రూపాయలు నగదు బహుమతి ఇస్తామని తెలంగాణ రాష్ట్ర డిజిటల్ మీడియా వింగ్ పేర్కొంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ ప్రత్యేకతల కోసం నగరంలోని అద్భుత ప్రదేశాల్ని ఎంపిక చేసుకుని మంచి రీల్స్ చేసి @DigitalMediaTS ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేస్తే చాలు. హైదరాబాద్ నగరం జీవనానికి ఎంత అనుకూలంగా ఉంటుందో నిరూపించేలా రీల్స్ ఉండాలి. ఒక్కొక్క రీల్ 60 సెకన్లు మించకూడదు. ఇతర నియమ నిబంధనల కోసం https://it.telangana.gov.in/contest/ లింక్ సంప్రదించాలి. ఏప్రిల్ 30 వరకూ గడువు తేదీ ఉంది.