»Vijay Devarakonda Went To The Shoot In A Boat The Video Viral In Social Media 2023
Viral Video: షూట్ కి బోటులో వెళ్లిన విజయ్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) తన క్రేజీ వీడియోను ఒకటి ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. రైడ్ టూ వర్క్ ఇన్ కేరళ అని తెలుపుతూ ప్రకటించారు. ఇది చూసిన విజయ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. రౌడీ ఫెల్లో మూవీ త్వరలో రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) పడవలో కూర్చుని బోటింగ్ చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వీడియోను స్వయంగా విజయ్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో రైడ్ టూ వర్క్ ఇన్ కేరళ అని పోస్ట్ చేశారు. వీడియోలో విజయ్ బ్లాక్ కలర్ స్టెట్స్ పెట్టుకుని చేతిలో మొబైల్ పట్టుకుని పడవలో ప్రయాణిస్తుండటం వీడియోలో గమనించవచ్చు. ఈ క్రమంలో అతని స్టైలిష్ లుక్ చూసిన అభిమానులు రౌడీ, లుక్స్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకో వ్యక్తి చూసి అప్ కమింగ్ మూవీ ఖుషీ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే వీడియోలో విజయ్ తన షర్టుకు పైన రెండు బటన్స్ ఓపెన్ చేసి ఉంచండం చూడవచ్చు. ఇది చూసిన నెటిజన్లు ఎందుకు బటన్స్ పెట్టుకోలేదని కామెంట్ల రూపంలో ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే 5 లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం.
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు అర్జెంట్‌గా ఒక సాలిడ్ హిట్ కావాలి. ఎట్టి పరిస్థితుల్లోను లైగర్(liger) ఫ్లాప్ నుంచి బయటపడాలని విజయ్ దేవరకొండ చూస్తున్నాడు. దాని కోసం ఎంత హార్డ్ వర్క్ చేసేందుకైనా రెడీగా ఉన్నాడు. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘ఖుషి’ సినిమాను పరుగులు పెట్టించాలనుకుంటున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించింది. గతంలో విజయ్-సామ్ మహానటి సినిమాలో కీ రోల్ ప్లే చేశారు. దాంతో ఖుషి సినిమాతో ఈ జోడీ ఆకట్టుకోవడం పక్కా అంటున్నారు అభిమానులు. సెప్టెంబర్ 1, 2023న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే చాలాభాగం వరకు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రాన్ని..వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్నాడు రౌడీ. రిలీజ్ టైం దగ్గర పడే సమయంలో.. చివర్లో హడావిడిగా షూటింగ్ చేసే బదులు.. ముందుగానే ఖుషిని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సామ్(samantha) వరుస బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు ఏవో కొన్ని కారణాల వల్ల.. సామ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుందని వినిపిస్తోంది. దీంతో అనుకున్న సమయంలో ఖుషి కంప్లీట్ అయ్యేలా లేదని సమాచారం. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది.