W.G: సైబర్ నేరగాళ్ల వలలో ఓ యువకుడు చిక్కుకున్నాడు. ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారానికి చెందిన టీచర్ కుమారుడికి ఒక మెస్సేజ్ వచ్చింది. ఆ మెస్సేజ్ ఓపెన్ చేయగా అతని బ్యాంక్ ఖాతాలో రూ.31 వేల నగదు మాయమైంది. అప్రమత్తమైన అతను బ్యాంకుకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. కొన్ని నెలల కిందట అదే గ్రామానికి చెందిన ఓ జర్నలిస్ట్, భీమవరంలోని ఓ డాక్టర్ రూ.17 లక్షలు మోసపోయారు.