»Bcci Asks Delhi Capitals To Avoid Rishabh Pant Jersey Gesture In Ipl 2023
IPL 2023: గుజరాత్‌తో మ్యాచ్‌కు రిషబ్ పంత్!
జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు లక్నోతో ఆడిన తొలి మ్యాచ్ లో పంత్ జెర్సీ నెంబర్ 17ను డగౌట్ లో ప్రదర్శించారు. ఈ విషయమై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రోడ్డు ప్రమాదంలో (rishabh pant accident) గాయపడి కోలుకుంటున్న రిషబ్ పంత్ (rishabh pant) మళ్లీ మైదానంలో కనిపించనున్నాడు! అయితే ప్రస్తుతానికి మ్యాచ్ ఆడేందుకు కాదు. మంగళవారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో (feroz shah kotla stadium) జరగనున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (delhi capitals vs gujarat titans) మ్యాచ్ కు తమ రెగ్యులర్ కెప్టెన్ ను తీసుకు రావడానికి ఢిల్లీ ప్రాంచైజీ ప్రయత్నాలు చేస్తోంది. అతను ఫ్రాంచైజీ ఓనర్స్ (franchise owner) ప్రాంతం నుండి మ్యాచ్ ను వీక్షించే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ (BCCI) అవినీతి నిరోధక, భద్రత బృందం అనుమతిస్తే కొంత సమయం అతను డగౌట్ లో కూడా ఉంటాడని ప్రాంచైజీ వర్గాలు చెబుతున్నాయి. అతను దగ్గర ఉండి తమ జట్టును సపోర్ట్ చేయనున్నాడు. రిషబ్ ఎప్పుడూ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భాగమే అని చెబుతున్నారు. పంత్ గత ఏడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో అతను ఈసారి ఐపీఎల్ కు (IPL) దూరమయ్యాడు. పంత్ స్థానంలో డేవిడ్ వార్నర్ (david warner) తాత్కాలిక సారథిగా కొనసాగుతున్నాడు.
ఇదిలా ఉండగా, జట్టు సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు లక్నోతో ఆడిన తొలి మ్యాచ్ లో పంత్ జెర్సీ నెంబర్ 17ను డగౌట్ లో ప్రదర్శించారు (Delhi Capitals place Rishabh jersey over dugout). ఈ విషయమై బీసీసీఐ తీవ్ర అసంతృప్తి (BCCI unhappy with DCs Jersey in dugout) వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఇది చాలా తీవ్రమైన చర్య అని, ఇలాంటివి అంతిమ విషాదం లేదా రిటైర్మెంట్ సమయంలోనే చేస్తారని చెప్పింది. పంత్ బాగున్నాడని, అందరూ ఊహించిన దాని కంటే వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ పేర్కొన్నది. జట్టు కూడా సదుద్దేశ్యంతో దీనిని చేసినప్పటికీ, ఇది సరికాదని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం చేయవద్దన్నారు.