కన్నప్ప కథలో చిత్రవిచిత్రమైన సరికొత్త పాయంట్లని టచ్ చేశామని విష్ణు చెప్పడం అందరూ విపరీతంగా ఫీలవుతున్నారు. ప్రభాస్ పరమశివుడి పాత్రలో కనిపించడం సినిమాకి ప్లస్ అవుతుందని అనుకున్నాడు విష్ణు గానీ, అదే మైనస్ పాయంట్ అవుతుందని కొందరు విమర్శకులు అంటున్నారు. వీటన్నిటితో పాటు, ప్రతీ చోటా కన్నప్పకి గండంలాగే ఉంది వ్యవహారం.
అన్నిటినీ ఒడ్డి, సర్వస్వం ధారబోసి ప్రముఖ కథానాకుడు, నిర్మాత మోహన్‌బాబు కన్నప్ప సినిమాని నిర్మిస్తున్నారు. అనుకున్న బడ్జెట్ ఒకటి, జరిగింది మరొకటి అయింది. ఊహకందని రీతిలో దాదాపు 150 కోట్లకు పైచిలుకు నిర్మాణవ్యయం పెరిగిపోయి, మోహన్‌బాబుని పూర్తిగా అయోమయంలోకి నెట్టేసింది కన్నప్ప చిత్రం. అసలు విష్ణు మీద అంత ఖర్చేమిటి అనే విమర్శలు వెల్లువెత్తూనే ఉన్నాయి.
అల్లు అర్జున్లాగానో, రామ్ చరణ్ లాగానో, ప్రభాస్లాగానో తాను కూడా పాన్ ఇండియా స్టార్నై పోవాలనే దుగ్ధతో విష్ణు తన తండ్రి మోహన్‌బాబుని ప్రోద్బలం చేసి, బలవంతంగా కన్నప్ప సినిమాకి ఒప్పించాడనే అపవాదు కూడా విష్ణు మూటగట్టుకున్నాడు, తారాగణమంతా కేవలం మోహన్‌బాబుకి ఉన్న పలుకుబడి కారణంగానే కన్నప్ప సినిమాలో పాత్రలు చేయడానికి ఒప్పుకున్నారు.
కొడితే ఈ దెబ్బకి ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే దురాశతో విష్ణు కన్నప్ప సినిమాని తలపెట్టాడు. తెలుగు దర్శకులు మొత్తం ప్రపంచసినిమానే ఏలుతుంటే, వాడెవడో ముక్కూమొహం తెలియని ఓ హిందీవాడిని తీసుకొచ్చి దర్శకుడిగా పెట్టి అక్కడ కూడా చెప్పరాని బడాయిలు పోయాడు విష్ణు. పైగా, గతంలో రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నప్పగా టైటిల్ రోల్లో ప్రముఖ దర్శకుడు బాపుగారు దర్శకత్వం వహించిన సినిమా ఓ అద్భుతమైన కళాఖండంగా అందరి జ్ఞాపకాలలో ఒక అపూర్వనిధిలా నిక్షిప్తమై ఇప్పటికీ ఉంది. ఇది కేవలం భక్తిరసాత్మకమైన కథ. కన్నప్ప మూఢభక్తికి కరిగిపోయిన మహాశివుడు కన్నప్పని అనుగ్రహించడమే కన్నప్ప మూల కథ. అంతకు ముందు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటించిన కన్నప్ప కూడా అజరామరమైన అమరగాయకుడు ఘంటసాల పాటలతో ప్రపంచమంతా దద్దరిల్లిపోయింది.
కానీ ఇప్పుడు మంచు విష్ణు కన్నప్పకి మరో వివరణ ఇస్తున్నాడు. అది మరీ విడ్డూరంగా ఉంది. కన్నప్ప కథలో చిత్రవిచిత్రమైన సరికొత్త పాయంట్లని టచ్ చేశామని విష్ణు చెప్పడం అందరూ విపరీతంగా ఫీలవుతున్నారు. ప్రభాస్ పరమశివుడి పాత్రలో కనిపించడం సినిమాకి ప్లస్ అవుతుందని అనుకున్నాడు విష్ణు గానీ, అదే మైనస్ పాయంట్ అవుతుందని కొందరు విమర్శకులు అంటున్నారు. వీటన్నిటితో పాటు, ప్రతీ చోటా కన్నప్పకి గండంలాగే ఉంది వ్యవహారం. బోలెడు డబ్బు పోసి ముంబైలో చేసిన విఎఫ్ఎక్స్ హార్డ్ డిస్క్ ని ఎవరో అనామకుడు దొంగిలించాడని జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఇదేంటి వరస అని అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇంత భారీ చిత్రంలో అమూల్యమైన విఎఫ్ఎక్స్ హార్డ్ డ్రైవ్‌ని ఎవడో దొంగిలించేసంత అజాగ్రత్తగా కార్యక్రమాలు జరుగుతున్నాయనమాట అని విష్ణుని తిట్టనివాడు లేడు. ఇది నిజంగా జరిగిందా, రిలీజ్ డేట్‌ని వాయిదా వేయడానికి విష్ణు ఎత్తిన ఎత్తా అనేది కూడా చర్చగా మారింది. దానాదీనా కష్టాల కడలిలో కన్నప్ప కథ ఎలా ముగుస్తుందోనన్న అనుమానాలు చెలరేగుతున్నాయి.