VSP: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం CI కే.వీ. సతీష్ కుమార్ కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రవర్తనలో మార్పు తెచ్చుకొని సమాజంలో మంచి పౌరులుగా మారాలని సూచించారు. మంచిగా మెలిగినవారి షీట్లు తొలగించేందుకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. మార్పు లేకపోతే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. వినాయక చవితి సందర్భంగా గొడవలకు దూరంగా ఉండాలని తెలిపారు.