పెద్ది చిత్రానికి గానూ నాటు గ్రామీణ పరమైన సెట్‌ను కూడా నిర్మించి, అందులో కథలో అతి ఎక్కువ భాగం చిత్రీకరణ జరుగుతుంది. దీని కోసం అదిరిపోయే సెట్ట్ నిర్మించారు. మనం ఆల్రెడీ టీజర్లో చూశాం. అంతా మొత్తం గ్రామీణ వాతావరణం ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేం కనిపించాయి. అవి కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి.
రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది షూటింగ్ కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. ఇటీవలే లండన్‌లో తన వేక్స్ విగ్రహం ప్రతిష్టాపన తర్వాత హైదరాబాద్ వచ్చిన రామ్ చరణ్ పెద్ది చిత్రీకరణ కార్యక్రమాలను టేకప్ చేసి, పూర్తి స్థాయిలో తలమునకలయ్యారు. ఎందుకంటే రిలీజ్ డేట్ కూడా వచ్చే సంవత్సరం తన పుట్టినరోజునాడే ముందస్తుగానే ఫిక్స్ కావడంతో రామ్ చరణ్ మరే ఇతరమైన పనులకు తావివ్వకుండా అనుక్షణం పెద్ది చిత్రానికే ప్రథమతాంబూలం ఇచ్చి మరీ ముందుకు వెళ్తున్నాడు.
రిలీజ్ డేట్ కూడా ముందుగానే ఫిక్స్ చేసి మరీ షూటింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టడానికి ప్రధానమైన కారణం లేకపోలేదు. గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్ కెరీర్‌కి పెద్ద అవరోధమే ఎదురైంది. దాదాపు మూడు సంవత్సరాల కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. అభిమానులు కూడా నీరుగారిపోయారు. అందుకే పెద్ది రిలీజ్ డేట్ ఖరారు చేస్తే అభిమానుల దృష్టి మొత్తం పెద్ది చిత్రం మీదనే ఉండడమే కాకుండా, మొన్నీమధ్యనే విడుదలైన పెద్ది టీజర్ పెద్ద దుమారమే లేపింది. రామ్ చరణ్ అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది.
ఇందులో విశేషం ఏమిటంటే పెద్ది చిత్రానికి గానూ నాటు గ్రామీణ పరమైన సెట్‌ను కూడా నిర్మించి, అందులో కథలో అతి ఎక్కువ భాగం చిత్రీకరణ జరుగుతుంది. దీని కోసం అదిరిపోయే సెట్ట్ నిర్మించారు. మనం ఆల్రెడీ టీజర్లో చూశాం. అంతా మొత్తం గ్రామీణ వాతావరణం ప్రతీ షాట్, ప్రతీ ఫ్రేం కనిపించాయి. అవి కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉండడంతో సినిమా మీద అంచనాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ఇలాటిదే ప్రయోగాన్ని ఇంతకు ముందే రంగస్థలం చిత్రంతో దర్శకుడు సుకుమార్ పూర్తిస్థాయిలో చేసి చూపించాడు. బ్రహ్మాండమైన హిట్ కొట్టి చూపించాడు. ఇదే మూస అనలేం గానీ, దాని ఇన్సిపిరేషన్ అని మాత్రం చెప్పగలం. దర్శకుడు సనా బుచ్చిబాబు కూడా సుకుమార్ ఫాలోవరే కావడం ఇక్కడ గమనార్హం.
రెగ్యులర్ సినిమాలని ప్రేక్షకులు చూడ్డం మానేసిన దరిమిలా ఎంత కష్టమైనా సరే ఏదో ఒక వైవిధ్యతని చూపించకపోతే మనుగడే కష్టమనే భావనకి హీరోలు ముందుగా వచ్చేశారు. దానికి తోడు దర్శకుల ఇమేజినేషన్ కూడా అదే కోణంలో పని చేస్తోంది. హిట్ కావాలంటే ఏదో ఒక కొత్తదనాన్ని ఆశ్రయించక తప్పని పరిస్థితులు ఎదురవుతున్నాయి. సో….రంగస్థలం పోలికలున్నా, కొత్త కథాసంవిథానం, టెక్నాలజీ సహాయం ఇవన్నీ పెద్దికి ఇప్పుడు పెద్ద దిక్కు.