ASR: మండల కేంద్రాల్లో నివాసం ఉంటున్న గిరిజనులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బీ.చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. ఇళ్లు ఉన్నవారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలన్నారు. సోమవారం చింతపల్లిలో కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి నిర్వహించిన అనంతరం మాట్లాడారు. మండల కేంద్రాల్లో ఉంటున్న ఇళ్లు లేని గిరిజనులకు 3సెంట్ల స్థలం ఇవ్వాలని కోరారు.