JN: జనగామ పట్టణంలోని చాకలి ఐలమ్మ నగర్ కాలనీలోని పేదల ఇండ్లకు ఇంటి నెంబర్లు, కరెంటు, మంచినీరు, రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతూ.. సీపీఎం నాయకులు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్కు సోమవారం మెమోరాండం ఇచ్చారు. నిరుపేదలకు న్యాయం చేయాలన్నారు. నేతలు మోకు కనకా రెడ్డి, బూడిది గోపి, జోగు ప్రకాష్, కళ్యాణం లింగం తదితరులు పాల్గొన్నారు.