SKLM: ప్రజా ఫిర్యాదులు స్వీకరణ పరిష్కారం కార్యక్రమంలో వచ్చే పిర్యాదులకు ప్రాధాన్యత ఇస్తూ జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఎస్పీ అర్జీ దారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.