సత్యసాయి: సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలోని సచివాలయాన్ని ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయంలో పలు రికార్డులు, రిజిస్టర్లు ఎంపీడీవో పరిశీలించారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని సచివాలయ సిబ్బందికి తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.