NLR: కావలి రూరల్ మండలం తాళ్లపాలెం పంచాయతీ రామచంద్రాపురం గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ట చేసిన శ్రీ రాజరాజేశ్వరి చంద్రమౌళీశ్వర స్వామి వారిని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.