ADB: నార్నూర్ మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు కొర్రల మహేందర్ సోమవారం హైదరాబాదులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేతుల మీదుగా దళితరత్న అవార్డు అందుకున్నారు. ఆయన చిన్న వయసులోనే అన్ని వర్గాల వారితో కలిసి మెలిసి ఉంటూ ఆపదలో ఉన్న వారికి సహాయం చేసే అతని గుణాన్ని గుర్తించి అవార్డు ఇచ్చినట్లు మహేందర్ పేర్కొన్నారు. దీంతో పలువురు ఆయన్ను అభినందించారు.