VZM: మహిళల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎస్‌కోట స్థానిక శ్రీనివాస కాలనీలో ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళల టైలరింగ్ శిక్షణా తరగతులను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ అవకాశాన్ని అర్హత గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.