NGKL: జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో కురిసిన వర్షపాత వివరాలిలా ఉన్నాయి. బిజినేపల్లి మండలం పాలెంలో అత్యధికంగా 26 మి.మీల వర్షపాతం నమోదైంది. నాగర్ కర్నూల్ 25.0 మి.మీ, పెద్దకొత్తపల్లి మండలం చిన్నరావుపల్లిలో 21.0 మి.మీ, ఉర్కొండ 9.0 మి.మీ, వెల్దండ 8.3 మి.మీ, కోడేరు 6.5 మి.మీ, తాడూరు 5.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.