ELR: ఉంగుటూరు నియోజకవర్గ స్థాయి రాజకీయ నాయకులతో ఏలూరు ఆర్డీవో డాక్టర్ అచ్యుత అంబరీశ్ సోమవారం సాయంత్రం సమావేశం కానున్నారని ఉంగుటూరు ఎలక్షన్ డ్యూటీ పోతురాజు పేర్కొన్నారు. ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు మండలకు చెందిన వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితా, ఇతర సమస్యలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.