GNTR: మంగళగిరిలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రాయపాటి శైలజ మహిళా హక్కుల కోసం కృషి చేస్తానని తెలిపారు. గత కమిషన్ ఆశించిన స్థాయిలో పనిచేయలేదని ఆమె అన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ న్యాయం చేస్తామని, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.