భారత్కు వ్యతిరేకంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ దెబ్బకు పాకిస్తాన్ నిరాశ నిస్పృహలకు లోనైందన్నారు. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చివేసిందన్నారు. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా దెబ్బతీశాం. భారత్ దెబ్బకు పాక్ కోలుకోలేని స్థితికి చేరిందని ఉద్ఘాటించారు.