NLR: అన్నదాత సుఖీభవ కింద అర్హులైన రైతులను గుర్తించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఎంఏఓ రామ మోహన్ సోమవారం పేర్కొన్నారు. పట్టా భూమి కలిగిన రైతులు ఆధార్ కార్డు జిరాక్స్, 1బీ వివరాలను మీ పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులకు అందజేయాలన్నారు. ఈ నెల 20వ తేదీ లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.