NLR: సంగం ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 14వ తేదీన బుధవారం మండల సాధారణ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో షాలెట్ తెలియజేశారు. ఉదయం 10:30లకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. మండలంలో ఎదుర్కొంటున్న పలు ప్రధాన సమస్యలు, త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తదితర సమస్యలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు.