GNTR: నల్లపాడు పరిధి అడవి తకెళ్లపాడుకు చెందిన నంద్యాల సంధ్యారాణి తన 9 ఏళ్ల కొడుకును అమ్మమ్మ చిల్లర లక్ష్మి తీసుకెళ్లి ఇవ్వడం లేదని ఎస్పీ కార్యాలయంలో మొరపెట్టుకుంది. కొడుకు ఆధార్ కార్డులు మారుస్తానని చెప్పి తీసుకెళ్లిందని, తిరిగి పంపించమని అడిగితే రూ. 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని తెలిపింది. తన బిడ్డను తనకు ఇప్పించాలని ఆ తల్లి జిల్లా ఎస్పీని వేడుకుంది.