NLR: డీఎస్సీ అభ్యర్థుల వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, ప్రిపరేషన్ సమయం 45 రోజుల నుంచి 90 రోజులకు పెంచాలని సిటీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేయాలన్నారు. ఎస్జీటీ పరీక్ష విడతల వారీగా కాకుండా ఆన్లైన్లో ఒకేసారి నిర్వహించాలన్నారు.