పాకిస్థాన్ కాల్పలు కారణంగా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చేయాలని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సూచించారు. గురుద్వారాలు, ఆలయాలు, మదరసాలు, దర్గాలే లక్ష్యంగా పాక్ దాడులు చేసిందని మండిపడ్డారు. కానీ భారత్ సైనికులు తమ దేశంలో మతపరమైన కట్టడాలపై దాడి చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తుందని ధ్వజమెత్తారు. అయితే వాస్తవం ఏంటనేది ప్రపంచానికి తెలుసన్నారు.