HYD: శామీర్‌పేటలోని మల్కాజిగిరి MP ఈటల రాజేందర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. CM రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్, NSUI నేతలు ముట్టడికి యత్నించారు. ఈటల రాజేందర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈటల వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గేట్ వైపు చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.