JGL: మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని తెలిపారు. సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచి ఉంటుందన్నారు.