ATP: అనంతపురం పట్టణంలో వైసీపీ మైనార్టీ నాయకుడు కరీమ్ గుండెపోటుతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి కరీమ్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు. కరీమ్ మృతిపట్ల వైసీపీ నాయకులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.