RR: చేవెళ్ల మండలం అంతారం గ్రామంలోని సర్వే నెంబర్ 185లోని అసైన్డ్ భూమిని కబ్జాచేసిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఆర్డీవో చంద్రకళను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ విషయమై గతంలో కూడా చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్యకు కూడా విన్నవించామని తెలిపారు.185సర్వే నెంబర్ లోని భూమిని కాపాడాలని కోరారు.