VZM: కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 136 అర్జీలు అందాయి. వాటిని జిల్లా కలెక్టర్ అంబేద్కర్, జేసీ సేతు మాధవన్ తదితరులు స్వీకరించారు. ఆయా సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈవారం మొత్తం 136 అర్జీలు అందగా, వీటిలో 75 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించినవే వచ్చాయన్నారు.