HYD: విద్యుత్ శాఖ సిబ్బంది తీరుతో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా టోలిచౌకి డివిజన్ పరిధిలోని ఝాన్సీనగర్లో వీధిలైట్లు 24 గంటలు వెలుగుతూనే కనిపించాయి. పగటిపూట కూడా వీధిలైట్లు వెలుగుతుండడంతో కరెంటు వృథా అవుతోంది. పలు కాలనీల్లో వీధిలైట్లు వెలగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై అధికారులు వీడాలని ప్రజలు కోరుతున్నారు.