KRL: ఎమ్మిగనూరు మున్సిపల్ కమీషనర్ ఎన్.గంగిరెడ్డి, సోమవారం తెల్లవారుజామున పట్టణం లోని పార్క్ రోడ్డు, సోమప్ప సర్కిల్, మార్కెట్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. గంగిరెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.