సీపీఐ విశాఖ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి సోమవారం తెలిపారు. జిల్లా కార్యదర్శిగా ఎస్కే రహిమన్, సహాయ కార్యదర్శిగా సత్యనారాయణ, చంద్రశేఖర్లు ఎన్నికైనట్టు తెలిపారు. జిల్లాలో జరిగిన 25 మహాసభలో విజయవంతమైనట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.