SRPT: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ శివారులోని దర్గా వద్ద కోదాడ-మిర్యాలగూడ జాతీయ రహదారిపై ఆదివారం కారు అదుపుతప్పి ఇటుక బట్టిలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నవారు స్వల్ప గాయాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు.