NLG: నకిరేకల్‌లోని గురు మందిరంలో వేసవి బాలల సంస్కార శిక్షణ శిబిరం ముగింపు ఉత్సవం ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. విశ్వహిందూ పరిషత్, జిల్లా మాతృ శక్తి ఆధ్వర్యంలో పది రోజుల శిక్షణలో 100 మందికి పైగా బాలలు పాల్గొని శ్రీరామాయణం, నిత్య ప్రార్ధన శ్లోకాలు, హనుమాన్ చాలీసా, ఆటలు, వ్యాయామం, కథలు, దేశభక్తి గీతాలు, కోలాటం వంటి అంశాల్లో శిక్షణ పొందారు.