MBNR: కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఆదివారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాదిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పేద ప్రజల ఆరోగ్యానికి వరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గొల్ల కృష్ణయ్య, సలాం, కురువ మన్యం పాల్గొన్నారు.