AKP: నాతవరం మండలం వైబీ.పట్నం గ్రామానికి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంటుగా నియమితులైన చిటికెల గంగునాయుడు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియామక పత్రాన్ని అందజేశారు. విధి నిర్వహణలో బాగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్, తాండవ ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ కరక సత్యనారాయణ పాల్గొన్నారు.