ATP: జిల్లాలోని ముఖ్యమైన పట్టణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ పీ.జగదీశ్ ఆదేశాలతో అనంతపురం, రాయదుర్గం, తాడిపత్రి తదితర పట్టణాల్లోని బస్టాండులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించారు. అసాంఘిక శక్తులను అణచి వేయాలనే లక్ష్యంతో భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.