SKLM: సరుబుజ్జిలి మండలం తెలికిపెంట గ్రామానికి చెందిన ఎన్.ఉగాది గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతనిది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం కాగితాపల్లి జెడ్పీహెచ్ పాఠశాలలో 2002–2003 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు ఆదివారం రాత్రి అతని కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.