RCBకి బిగ్ షాక్ తగలనుంది. బెంగళూరు పేసర్ జోస్ హేజిల్‌వుడ్ భుజం నొప్పి కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూన్‌లో WTC ఫైనల్ మ్యాచ్ ఉన్నందున ముందు జాగ్రత్తగా అతడిని తిరిగి భారత్‌కు పంపకూడదని ఆసీస్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్లో హేజిల్‌వుడ్ 18 వికెట్లు తీశాడు.