ELR: ముసునూరు మండలం రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో శుక్రవారం జై భారత్ మాత అంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పసుమర్తి రామకృష్ణ మాట్లాడుతూ.. పాకిస్థాన్లోని ఉగ్రమూక ఏరువేత చర్యలకు అన్ని దేశాల ప్రజలు మద్దతు నివ్వాలని కోరారు. కష్ట సమయంలో భారత్కు వెన్నుదన్నుగా ఉండాలన్నారు. సోషల్ ఉపాధ్యాయులు అంగడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.