»Ram Navami Clashes Sri Ram Navami Violence Erupts In West Bengal And Bihar
చల్లారని Sri Rama Navami ఘర్షణలు.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తత
ఘర్షణలు, మంటలు చెలరేగించి దానితో చలి కాచుకునే లక్షణం బీజేపీకి ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. చెలరేగిన అల్లర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు.
పండుగల వేళ ఘర్షణలు (Clashes) చెలరేగుతున్నాయి. ఊరేగింపుల పేరిట నిర్వహించే కార్యక్రమాలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. తాజాగా శ్రీరామనవమి (Sri Rama Navami) సందర్భంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల అల్లర్లు మొదలయ్యాయి. ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా కొందరు ప్రవర్తించడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని (Telangana) హైదరాబాద్ (Hyderabad)లో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) ఇలాంటి ధోరణితో వ్యవహరించాడు. ఇతర వర్గాలను దూషిస్తూ.. రెచ్చగొట్టే విద్వేష ప్రసంగం చేశాడు. బండ బూతులతో విరుచుకుపడడంతో అతడిపై కేసు నమోదైంది. ఇలాంటి పరిస్థితులే బిహార్ (Bihar), పశ్చిమ బెంగాల్ (West Bengal)లో చోటుచేసుకున్నాయి. మార్చి 30న మొదలైన ఘర్షణలు నాలుగు రోజులైనా చల్లారలేదు. ప్రస్తుతం పలుచోట్ల ఇంకా ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి.
శ్రీరామనవమి సందర్భంగా బిహార్, పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు మొదలయ్యాయి. బెంగాల్ లోని హుగ్లీలో (Hooghly) బీజేపీ నిర్వహించిన శోభాయాత్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బీజేపీ ఎమ్మెల్యే బీమన్ ఘోష్ (Biman Ghosh) తో పాటు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ (Dileep Ghosh) రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. దీంతో అల్లర్లు చెలరేగాయి. హావ్ డా అనే ప్రాంతంలో కూడా హింస చెలరేగింది. బిహార్ లోని సాసారాం జిల్లాలో (Sasaram District) ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తన పర్యటనను రద్దు చేసుకున్నాడు. నలందలోని బిహార్ షరీఫ్ (Bihar Sharif)లో 77 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదే ప్రాంతంలో శనివారం రాత్రి కూడా అల్లరిమూకలు హింసకు పాల్పడ్డాయి. రోహతాస్ జిల్లాలో కూడా అల్లర్లు జరుగుతున్నాయి. దీంతో ఈనెల 4వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈ అల్లర్ల వెనుక బీజేపీ ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఇతర వర్గాలను రెచ్చగొట్టి మత ఘర్షణలు (Religious Conflicts) సృష్టించి బీజేపీ రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS Party) తోపాటు ఇతర పార్టీలు మండిపడ్డాయి. ఘర్షణలు, మంటలు చెలరేగించి దానితో చలి కాచుకునే లక్షణం బీజేపీకి ఉందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (Trinamool Congress) పేర్కొంది. కాగా రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లపై ముఖ్యమంత్రి, టీఆఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు చర్యలు చేపట్టారు. బీజేపీ తీరును ఖండించారు. బీజేపీ వలనే మత ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పడానికి బెంగాల్ లో జరిగిన ఘర్షణలే నిదర్శనమని మమతా పేర్కొన్నారు.