JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ఆలయ సిబ్బంది తదితరులున్నారు.