HYD: రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తుండటంతో జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. బహిరంగంగా చెత్త వేసే వారిపై రూ.500 నుంచి 2వేల వరకు ఫైన్ విధించనున్నారు. స్వచ్ఛ నగరమే లక్ష్యమని.. ప్రజల్లో మార్పు తీసుకురావడమే తమ ఉద్దేశ్యమని జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలిపారు.