గుంటూరు: ఈ నెల 4వ తేదీన పొన్నూరు మండలం పచ్చలతాడిపర్రు గ్రామంలో అప్పుడే పుట్టిన మగ శిశువును పంటపొలాల్లో వదిలి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శిశువును పొన్నూరులోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాల సూపరిండెంటెండ్ డాక్టర్ ఫిరోజ్ ఖాన్ వైద్య పరీక్షలు చేసి సంరక్షణలో ఉంచారు. సోమవారం శిశువును పొన్నూరు ఐసీడీఎస్ సిబ్బందికి అప్పజెప్పారు.