గుంటూరు: జిల్లాలో కొత్త ఫ్లైఓవర్ ప్రభుత్వం నిర్మించనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. అధికారులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 7వ తేదీన ఫ్లైఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. శంకుస్థాపన కోసం గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు.