BPT: బాపట్లలో కొలువై ఉన్న శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి నవాహ్నిక దీక్ష పూర్వక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ధ్వజారోహణ కార్యక్రమం వేడుకగా జరిగింది. అనంతరం శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారు ఉభయ దేవేరులతో కలిసి సూర్య ప్రభ వాహనంపై దివ్య మంగళ దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.