GNTR: మహాత్మా గాంధీ, నెహ్రూ గురించి సోషల్ మీడియాలో అశ్లీల వ్యాఖ్యలు చేసిన సినీ కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్రాపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం NSUI ఫిర్యాదు చేసింది. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన NSUI జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం, స్వాతంత్య్ర సమరయోధుల హోదాను అవమానించారంటూ, వెంటనే ఆమెపై FIR నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.